యూట్యూబ్ లో ఛానెల్ క్రియేట్ చేయడం !
ఎప్పుడు, ఎక్కడ, ఏం చేస్తున్నాం అనే విషయాల్ని వీడియోలుగా చిత్రీకరించి Youtubeలో అప్‌లోడ్ చేయడం పరిపాటిగా మారింది. ఒక వ్యక్తిగత విషయాలే కాకుండా తమకు నచ్చిన ఇతరత్రా ఆసక్తికర అంశాలను కూడా వీడియోలుగా చిత్రీకరణ చేయడం మొదలైంది. ఇలా యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్ తో ఖాతాదారులకు తమ వీడియో వ్యూస్ కు అనుగుణంగా ఆదాయం కూడా వస్తుండటం విశేషం. దీంతో Youtubeలో కంటెంట్ క్రియేటర్లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అయితే ఈ క్రమంలో కొందరు వీడియోలు తీసే ఆసక్తి ఉన్నప్పటికీ యూట్యూబ్‌లో అకౌంట్ తీయడం ఎలాగో తెలీక సతమతమవుతున్నారు. యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవడం చాలా సులువైన ప్రక్రియ. మీరు కూడా యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా Gmail లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ జీమెయిల్ సహాయంతో తో యూట్యూబ్ లో Sign in అవ్వాలి. యూట్యూబ్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు పలు రకాల ఆప్షన్స్ కనబడతాయి. వాటిలోనే రెండో ఆప్షన్ "Create a New Channel" అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. "Create a New Channel" ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో(బా...