రియల్‌మీ సీ30 విడుదల
రియల్‌మీ సీ30 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సోమవారం లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇదే. ఇందులో ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌ను అందించారు. 1 టీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో పెంచుకునే అవకాశం ఉంది. రెడ్‌మీ 10ఏ, టెక్నో స్పార్క్ 2022, శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్‌లతో ఈ ఫోన్ పోటీ పడనుంది. ఇందులో రెండు వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 3 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.8,299గా నిర్ణయించారు. బాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జూన్ 27వ తేదీన దీని సేల్ జరగనుంది. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత రియల్‌మీ యూఐ గో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా... స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 3 జీబీ వరకు ర్యామ్, 32 ...