Posts

Showing posts with the label యూఎస్ జియోలాజికల్ సర్వే

అమెరికాలో భూకంపం !

Image
అ మెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మధ్యాహ్నం 12:20 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) మొదట భూకంప తీవ్రత 4.7గా నివేదించింది. ఆ తర్వాత దానిని 4.4గా తగ్గించింది. హైలాండ్ పార్క్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 2.5 మైళ్ల దూరంలో భూకంపం కేంద్రీకృమైంది. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 7.5 మైళ్ల లోతులో ఉంది. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు వణికి పోయాయి. జనాలు ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యారు. స్కూళ్లలో పిల్లలు, టీచర్లు సైతం ఒక్కసారిగా వణికిపోయారు. భయంతో కేకలు పెట్టారు. ఈ ఘటనతో తాము బలమైన కుదుపులతో వణికిపోయామని పలువురు అమెరికా మీడియా సంస్థలతో చెప్పారు. తాము ఎదుర్కొన్న పరిస్థితిని కూడా వివరించారు. లాస్ ఏంజెల్స్ కౌంటీ, సిటీ ఫైర్ డిపార్ట్‌మెంట్‌లు భూకంప మోడ్‌ని యాక్టివేట్ చేశాయి. ఆ ప్రాంతం పరిధిలో సిబ్బంది ఏదైనా నష్టం చోటుచేసుకుందా? లేదా? అనే దానిపై లోతుగా సర్వే చేశారు. ఎటువంటి భారీ నష్టం జరగలేదని సిబ్బంది గుర్తించడంతో.. లాస్ ఏంజిల్స్ సిటీ ఫైర్ మధ్యాహ్నం 1.15 గంటలకు భూకంప మోడ్‌ను ముగించింది. అయితే భూకంప కేంద్రానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న పసాదేనాలో స్వల్ప నష్టం సంభవించింది. పసాడేనా స...