మైక్రోసాఫ్ట్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం
సమీప భవిష్యత్తులో ఉద్యోగాల్లో స్థిరపడేందుకు యువతకు కావాల్సిన శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఇందుకోసం తాజాగా ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ రెండు లేదా అంతకంటే పై సంవత్సరం గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసిస్తున్న వారు దీనికి అర్హులు. ఈ ప్రోగ్రాంను 2022, 2023 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయబోయే వారు లేదా 2021లో డిగ్రీ పూర్తి చేసిన వారికోసం ప్రత్యేకంగా అందిస్తోంది మైక్రోసాఫ్ట్. 2022-2024 మధ్య దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన మొదటి బ్యాచ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 15 నుంచి ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ ఉచితంగా ఈ శిక్షణ అందిస్తోంది. విద్యార్థులకు ఎటువంటి వేతనం/ ఉపకార వేతనం ఇవ్వరు అనే అంశాన్ని గమనించాలి. ఈ ఇంటర్న్‌షిప్ కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, ఎర్నస్ట్ & యంగ్ , గిట్ హబ్, క్వెస్ కార్ప్ వంటి సంస్థలతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ప్లాట్...