లెనోవో టాబ్ ఎం11 విడుదల !
లె నోవో అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త టాబ్లెట్ లెనోవో టాబ్ ఎం11 ఆవిష్కరించింది. గత జనవరిలో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో తొలుత ఈ టాబ్లెట్ ను ప్రదర్శించింది లెనోవో. మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ, 15 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 7040 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది. రెండు కనెక్టివిటీ వేరియంట్లలో లభ్యం అవుతున్నది లెనోవో టాబ్ ఎం11. వై-ఫై ఆప్షన్ మాత్రమే గల లెనోవో ఎం11 రూ.17.999 , ఎల్టీఈ వేరియంట్ విత్ లెనోవో టాబ్ పెన్ వేరియంట్ రూ.21,999 పలుకుతుంది. లెనోవో ఇండియా వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయిస్తారు. లెనోవో టాబ్ ఎం11 టాబ్లెట్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 11-అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ (1920×1200 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. హెచ్డీ క్వాలిటీ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కోసం టీయూవీ రైన్ లాండ్ సర్టిఫికేషన్ ఇస్తారు. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ గల ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ యూఐ వర్షన్ పై పని చేస్తుంది. రెండేండ్ల పాట...