Posts

Showing posts with the label మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తాం !

Image
వ రంగల్ లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని అన్నారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని తెలిపారు. వరంగల్ ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వివరించారు.

వేబ్రిడ్జి కాటా లో తేడా వస్తే మిల్లులు సీజ్ చేస్తాం : మంత్రి పొంగులేటి

Image
తె లంగాణలో రైతులు తీసుకొచ్చిన పత్తి లో కోత విధిస్తే సహించబోము. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి రైతులు నష్ట పోయారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుంది. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం. రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని విప్లవాత్మక మార్పులు చేసాం. ఇప్పటికే 18వేల కోట్ల రుణమాఫీ చేసాం. రుణమాఫీ పై ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నారు. అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైన రుణమాఫీ చేస్తాం. డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తాం. అలాగే అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు దీపావళి కానుకగా ఇవ్వబోతున్నాం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఇల్లు కట్టిచారో ఇప్పుడు కూడా అలాగే ఇస్తాం. వరికి సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాము,ఇవ్వబోతున్నమ్. ధాన్యంలో తేమ శాతం కోసం ఎండబెట్టుకుని తీసుకుపోవాలి. సీసీఐ నామ్స్ ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలి. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలి. రైతులు ఫిర్యాదు...

ఈ నెల చివరిలోపు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు !

Image
ఈ నెల చివరి లోపు మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు అందజేస్తామని తెలిపారు. 1లక్ష 50వేల ఇళ్లకు టెండర్లు పిలిచామని, 98వేల ఇండ్లు కట్టామని, 40వేల ఇండ్లు పంపిణీ చేశామని, ఇంకా 58వేలు పంపిణీ చేయాల్సివుందని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ఎన్నికల్లో లబ్ధి కోసం చూపించుకోవడానికే వాడుకుందన్నారు. బీఆర్ఎస్ పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనైనా, ఉద్యోగాల్లోనైనా, ప్రాజెక్టుల్లోనైనా కేవలం రాజకీయ అర్భాటంతో సరిపెట్టారని పొంగులేటి విమర్శించారు. మ ప్రభుత్వం అసంపూర్తి ఇళ్లను పూర్తి చేయించడంతో పాటు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్న పేదల కోసం చేసే పథకాల విషయంలో రాజీ పడలేదన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ గోషామహల్ నియోజకవర్గంలోని లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.