Posts

Showing posts with the label భారత అంతరిక్ష పరిశోధన సంస్థ

సూర్యుడ్ని ఫొటో తీసిన ఆదిత్య ఎల్‌-1

Image
ఆ దిత్య ఎల్‌-1 సూర్యుడ్ని తొలిసారి ఫొటో తీసింది. ఆ చిత్రాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రవారం విడుదల చేసింది. సూర్యుడి గురించి పరిశోధనల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌ 2న తొలి సన్‌ మిషన్‌ ఆదిత్య ఎల్‌-1ను ఇస్రో లాంచ్‌ చేసింది. నవంబర్‌లో అది సూర్యుడి సమీపానికి చేరుకుంది. దీంతో ఆదిత్య-ఎల్1లో ఉన్న సోలార్ అల్ట్రావైలైట్‌ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్‌యూఐటీ)ను నవంబర్‌ 20న యాక్టివేట్‌ చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 6న సూర్యుడి గుండ్రటి తొలి చిత్రాన్ని తీసిందని ఇస్రో తెలిపింది. ఆ ఫొటోను శుక్రవారం విడుదల చేసింది. సౌర పరిశీలన, పరిశోధనలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించింది. కాగా, ఎస్‌యూఐటీ ద్వారా 200 నుంచి 400 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో సూర్యుడు కనిపించే ఉపరితలం, దానిపై ఉండే పారదర్శక పొరకు సంబంధించిన సన్‌ ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ చిత్రం చాలా అద్భుతంగా ఉందని ఇస్రో తెలిపింది. సూర్య కిరణాలు, సోలార్‌ స్పాట్‌లు, సోలార్‌ రేడియేషన్‌ను అధ్యయనం చేయడానికి ఈ పొరలు కీలకమని వివరించింది. అంతరిక్ష వాతావరణం, భూమి వాతావరణంపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. సూర్యుడి వాతావరణానికి సంబంధించిన వివరణాత్మక పరిశీలన క...

26న పీఎస్ఎల్వీ-54 ప్రయోగం !

Image
ఈనెల 26న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ-54 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(పీఎస్ఎల్వీ)-54. శనివారం ఉదయం 11.56 గంటలకు ఈ ప్రయోగం జరుగనున్నట్లు వెల్లడించింది. ఓషన్ షాట్-3 ఉపగ్రహంతో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఓషన్ షాట్-3తో పాటు భూటాన్ శాట్, ఆనంద్, ధృవ స్పేస్ నుంచి రెండు టైబోల్ట్ శాటిలైట్లను, నాలుగు ఆస్ట్రోకాస్ట్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది పీఎస్ఎల్వీ-54. ఇస్రో అత్యంత సక్సెస్ ఫుల్ ఉపగ్రహ వాహకనౌక పీఎస్ఎల్వీ ద్వారా వీటన్నింటిని అంతరిక్షంలోకి చేర్చనున్నారు. భూ పరిశీలన ఉపగ్రహం(ఈఓఎస్)గా ఓషన్‌శాట్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఓషన్‌శాట్ సిరీస్ లో ఓషన్‌శాట్-1, ఓషన్‌శాట్-2 ఉప్రగ్రహాలను ప్రయోగించారు. ప్రస్తుతం ఈ సిరీస్ లో మూడో ఉప్రగ్రహంగా ఓషన్‌శాట్-3ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. సముద్ర అధ్యయనం, వాతావరణ అధ్యయనాలకు ఈ ఓషన్‌శాట్ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. తుఫానుల అంచనా వేయడానికి ఇవి సహకరిస్తాయి. ఈ ఉపగ్రహ శ్రేణిలో ఓషన్...

తిరుపతిలో 'స్పేస్‌ ఆన్‌ వీల్స్‌' మొబైల్ ఎక్స్‌పో !

Image
మినియేచర్‌ రాకెట్‌ నమూనాలతో కూడిన 'స్పేస్‌ ఆన్‌ వీల్స్‌' ఎక్స్‌పో విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన అనేక రాకెట్‌ నమూనాలతోపాటు లాంచ్‌ ప్యాడ్స్‌, చంద్రయాన్‌ మిషన్‌-1, మంగళ్యాణ్‌ వంటివి ఎన్నో విద్యార్థులను కట్టిపడేస్తున్నాయి. మూడు రోజులుగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో, పాఠశాలల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్థులతోపాటు సామాన్య ప్రజానీకాన్ని ఎంతో ఉర్రూతలూగిస్తున్నది. ప్రదర్శనకు పెట్టిన వివిధ రాకెట్లు, లాంచింగ్‌ ప్యాడ్ల గురించి అధికారులు విపులంగా చెప్తూ వారికి అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ప్రతి మంత్రిత్వ శాఖ గత 75 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే అంతరిక్ష శాఖకు చెందిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఎగ్జిబిషన్‌తో 'స్పేస్ ఆన్ వీల్స్'కు శ్రీకారం చుట్టింది. పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనకు పెట్టి విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలను విశేషంగ...