Posts

Showing posts with the label బ్లూటూత్ ఆన్ చేసి వుంచితే హ్యాకింగ్ రిస్క్ !

బ్లూటూత్ ఆన్ చేసి వుంచితే హ్యాకింగ్ రిస్క్ !

Image
ఒకప్పుడు బ్లూటూత్ వినియోగం పెద్దగా ఉండేది కాదు. కానీ బ్లూటూత్ డివైజ్‌లు వచ్చిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ ఎప్పటికీ ఆన్‌లోనే ఉంటుంది. బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ హెడ్‌సెట్, ఇయర్‌బడ్స్... ఇలా బ్లూటూత్‌తో కనెక్ట్ అయ్యే ఆడియో ప్రొడక్ట్స్ డివైజ్‌లు చాలా ఉన్నాయి. రెండు మూడు ఆడియో ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటివి ఉపయోగిస్తారు కాబట్టి ప్రతీసారి బ్లూటూత్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఎందుకని ఎప్పటికీ బ్లూటూత్ మోడ్ ఆన్‌లో పెట్టడం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలవాటైపోయింది. ఈ అలవాటే కొంపముంచుతోందని తాజాగా బయటపడింది. బ్లూటూత్ ఆన్‌లో ఉంటే అది డిస్కవరీ మోడ్‌లో ఉన్నట్టే. అంటే బ్లూటూత్ ఆన్‌లో ఉంది కాబట్టి దగ్గర్లో బ్లూటూత్ డివైజ్ ఏదైనా ఉందా అని నిరంతరం సెర్చ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం మాత్రమే కాదు, యూజర్లకు హ్యాకింగ్ రిస్క్ కూడా ఎదురవుతోంది. ఇలా బ్లూటూత్ డిస్కవరీ మోడ్‌లో ఉన్నప్పుడు, మీ డివైజ్‌కు పది మీటర్ల పరిధిలో ఉన్న హ్యాకర్లు, స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. స్మార్ట్‌ఫోన్లు లేదా బ్లూటూత్‌తో పనిచేసే డివైజ్‌లలో ఉండే బ్లూటూత్ కన...