Posts

Showing posts with the label బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసం వరకు అభిమానులతో ర్యాలీ

హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం !

Image
ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ పర్యటన ముగియంతో ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు.హైదరాబాద్ నగరమంతా చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతు టీడీపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇది మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనపై చర్చించే అవకాశముంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది.