కేంద్ర బడ్జెట్‌లో బీఎస్ఎన్ఎల్ కు రూ.82,916 కోట్లు కేటాయింపు !
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీఎస్‌ఎన్‌ఎల్ కు ఏకంగా రూ.82,916 కోట్లు కేటాయించింది. దీంతో పూర్తిస్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో టెలికాం శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు సహా ఇతర సంస్థల కోసం రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో బీఎఎస్‌ఎన్‌ఎల్ టెక్నాలజీ అప్‌గ్రేడ్ మరియు పునర్నిర్మాణం కోసం రూ.82.916 కోట్లు కేటాయించారు. దీంతోపాటు దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు నిర్దిష్ట టెలికాం పరికరాల పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతోపాటు మొబైల్ ఫోన్లు, ఛార్జర్‌లు, PCBA లపై సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. ఫలితంగా దిగుమతి అవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గనున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ ఆగస్టు నుంచి 4G సర్వీసులను ప్రారంభించనుంది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, తేజస్ నెట్‌వర్క్స్, TCS సంస్థలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించాయి. దీంతోపాటు దేశవ్యా్ప్...