ఇండియన్ రైల్వే బైక్ పార్శిల్ సర్వీస్ !
భా రతీయ రైల్వే బైక్ పార్శిల్ సర్వీస్ దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతాన్ని కవర్ చేస్తుంది, కాబట్టి రైల్వే స్టేషన్ ఉన్న ఏ ప్రదేశానికైనా బైక్‌ను పంపవచ్చు. అయితే, డోర్ డెలివరీ ఆప్షన్ లేదు. బైక్‌ను స్టేషన్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. మోటార్ సైకిల్‌ను ఒక నగరం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేయడానికి రైల్వేస్ చౌకైన, సురక్షితమైన సర్వీస్ అందిస్తోంది. అదే ఇండియన్ రైల్వే బైక్ పార్శిల్ సర్వీస్. ఇండియన్ రైల్వేస్ బైక్ పార్శిల్ సర్వీస్‌తో బైక్‌ను రైలులో లగేజీగా లేదా పార్శిల్‌గా మరొక సిటీకి రప్పించుకోవచ్చు. ఈ సర్వీస్‌ను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. బైక్ దూరం, బరువు ప్రకారం డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. లగేజీగా బైక్‌ను ట్రైన్ ఎక్కించాక దానిని ట్రాక్ చేసే సదుపాయం కూడా ఉంటుంది, దాని స్టేటస్ అప్‌డేట్స్ కూడా ఎప్పటికప్పుడు పొందవచ్చు. సమీపంలోని రైల్వే పార్శిల్ బుకింగ్ స్టేషన్‌కి వెళ్లి ఇందుకు సంబంధిత ఫారమ్ నింపి రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలి. బైక్ బరువు ఆధారంగా ఫీజు చెల్లించి, రైల్వే రిసిప్ట్ తీసుకోవాలి. రిసిప్ట్ తీసుకున్నాక గమ్యస్థానంలో బైక్‌ను కలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బుక...