బ్లూటూత్ 5.3 విడుదల !
బ్లూ టూత్ ప్రతీ డిజిటల్ యూజర్ జీవితంలో భాగమైపోయింది. వైర్‌లెస్ ఆడియో స్ట్రీమింగ్, ఫైల్స్ ట్రాన్స్‌ఫర్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ చేయాలంటే బ్లూటూత్ టెక్నాలజీనే యూజర్లు వినియోగించాల్సి వస్తోంది. కీబోర్డ్, మౌస్, మొబైల్ యాక్సెసరీస్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా ఈ టెక్నాలజీ అవసరం. ఈ కనెక్టివిటీ టెక్నాలజీ గత కొన్ని సంవత్సరాలుగా మెరుగుపడుతూ వస్తోంది. రీసెంట్‌గా 5.3 పేరుతో బ్లూటూత్ లేటెస్ట్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇది పాత వెర్షన్‌ల కంటే ఎక్కువ స్పీడ్, రేంజ్ ఆఫర్ చేస్తుంది. బ్లూటూత్ వైర్‌లెస్ టెక్నాలజీ ఫైల్స్, డేటాను తక్కువ దూరాలల్లో సమర్థవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇది 2.402 & 2.480 GHz లేదా 2.400 & 2.4835 GHz వంటి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలపై పనిచేస్తుంది. కమ్యూనికేషన్ కోసం మాస్టర్-స్లేవ్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడుతుంది. బ్లూటూత్ 5.0 వెర్షన్ 2016లో అందుబాటులోకి వచ్చింది. ఇది బ్లూటూత్ లో ఎనర్జీ ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ వేగాన్ని 2 Mbit/sకి రెట్టింపు చేసింది. కానీ రేంజ్‌ను తగ్గించింది. ఇది రెండు డివైజ్‌లను ఏకకాలంలో కనెక్ట్ చేయడానికి వీలు కల్పించింది. పెరిగిన వేగం, పరిధి, డేటా ట్రాన్స్‌ఫ...