Posts

Showing posts with the label ప్లే స్టోర్ నుంచి 3

ప్లే స్టోర్ నుంచి 3,500 పైగా లోన్ యాప్స్‌ తొలగింపు !

Image
భారత ప్రభుత్వం, ఆర్బీఐ సూచనలతో టెక్ దిగ్గజం గూగుల్‌ స్పందించి తమ యాప్ స్టోర్‌లో అక్రమ రుణాల ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గురువారం తెలిపింది. 2022లోనే 1.73 లక్షల 'బ్యాడ్‌ అకౌంట్స్‌'ను నిషేధించినట్లు గూగుల్ వెల్లడించింది. గత ఏడాది 14.3 లక్షల పాలసీ-ఉల్లంఘించే యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లో లిస్ట్‌ కాకుండా నిరోధించింది. దీంతో 2 బిలియన్ల డాలర్ల విలువైన మోసపూరిత, దుర్వినియోగ లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించింది. ప్లే స్టోర్ గైడ్‌లైన్స్‌ని ఉల్లంఘించినందుకు గూగుల్ 2022లోనే ఇండియన్ యాప్ మార్కెట్ ప్లేస్ నుంచి 3,500కి పైగా డిజిటల్ లెండింగ్ యాప్‌లను తొలగించింది. ఇటీవల గూగుల్‌ తన ప్లే స్టోర్ పాలసీని పునరుద్ధరించింది. కాంటాక్ట్‌లు, ఫోటోలు, కాల్ లాగ్స్, లొకేషన్ వంటి వినియోగదారుల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయకుండా రుణాలు ఇచ్చే యాప్‌లను నిషేధించే కఠినమైన గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు ప్లే స్టోర్‌లో లిస్టింగ్ కోసం ఆమోదం పొందడానికి ఈ కఠినమైన గైడ్‌లైన్స్‌ తప్పనిసరిగా పాటించాలి. సేవలు ప్రారంభించడానికి తప్పనిసరిగా RBI ల...