లీకైన ఐఫోన్ 16 ఫీచర్లు !
గత నెల యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ ను విడుదల చేసింది. ఐఫోన్ 15 సిరీస్లో కొత్తగా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 16లో ఆ లోటును పూరించగలదని వార్తలు వస్తున్నాయి. నిజానికి వినియోగదారులు ఐఫోన్ 15లో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేటును ఆశించారు. కానీ కంపెనీ ఇందులో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును అందించారు. రూ.80 వేల ధర వద్ద ఇది నిరాశే అని చెప్పవచ్చు. ఇండియా టుడే నివేదిక ప్రకారం యాపిల్ ఐఫోన్ 16 బేస్ మోడల్లలో 120Hz రిఫ్రెష్ రేట్ ను అందించనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ బేస్ మోడల్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను మాత్రమే అందిస్తోంది. ఐఫోన్ 16 ప్రోలో 6.3 అంగుళాల డిస్ప్లేను, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లో 6.9 అంగుళాల డిస్ప్లే యాపిల్ అందించనుందని లీక్ల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ల్లో 6.1, 6.7 అంగుళాల డిస్ప్లేను అందించే అవకాశం ఉంది. యాపిల్ ప్రారంభంలో ఐఫోన్ 15 ప్రో లైనప్ తో సాలిడ్ స్టేట్ బటన్ ను పరిచయం చేయాలని భావించింది. ఇది ఐఫోన్ ఎస్ఈ సిరీస్ హోమ్ బటన్ లో కనిపించే హాప్టిక్ ఫీడ్ బ్యాక్ సిస్టమ్ మాదిరిగా ఉంటుంది. ఐఫోన్ 15 ప్రోలో కంపెనీ దీన్ని అందించనప్పటికీ, ...