Posts

Showing posts with the label ప్రస్తుతం బీటా వెర్షన్‌ లో ఉంది

అడోబ్‌ ఫైర్‌ఫ్లై వీడియో మోడల్‌ ఆవిష్కరణ !

Image
అ డోబ్‌ ఏఐ వీడియో జనరేటర్‌ ను ఆవిష్కరించింది. ఈ ఫైర్‌ఫ్లై వీడియో మోడల్‌  ప్రస్తుతం పబ్లిక్‌ బీటా వెర్షన్‌లో కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది. అడోబ్‌లో ప్రస్తుతం ఇమేజ్‌ మోడల్‌, వెక్టార్‌ మోడల్‌, డిజైన్‌ మోడల్‌ వంటి AI జనరేటివ్‌ మోడల్స్‌ను కలిగి ఉంది. తాజాగా ఫైర్‌ఫ్లై వీడియో మోడల్‌ ను ఆవిష్కరించింది. ఈ వీడియో మోడల్‌ 100 కి పైగా భాషల్లో టెక్ట్స్‌ ప్రాంప్ట్‌ లను సపోర్టు చేస్తుంది. మరియు వాణిజ్య పరమైన అవసరాలు సహా అద్భుతమైన కంటెంట్‌ కోసం ఉపయోగించుకోవచ్చు. అడాబ్‌ ఫైర్‌ఫ్లై AI మోడల్‌ కొత్త టూల్స్‌ ను కలిగి ఉంటుంది. ప్రీమియర్‌ ప్రో.. పుటేజీని పెంచుకొనేందుకు మరియు ఇమేజ్‌, టెక్ట్స్‌ ప్రాంప్ట్స్‌ నుంచి వీడియోలను రూపొందించవచ్చు. ప్రీమియర్‌ ప్రో జనరేటివ్‌ ఎక్స్‌టెండ్‌ టూల్‌ ప్రస్తుతం బీటా వెర్షన్‌ లో ఉంది. దీని ద్వారా 24 FPS వద్ద 720P లేదా 1080P వద్ద రెండు సెకెన్లపాటు వీడియోను పొడిగించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ రీటేక్‌ అవసరాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు ఈ ఫీచర్‌ ద్వారా ఆడియోను మెరుగుపరచవచ్చు. మరియు సౌండ్‌ ఎఫెక్ట్‌ లను గరిష్ఠంగా 10 సెకన్లపాటు పొడిగించవచ్చు. దీంతోపాటు టెక్ట్స్‌ టూ వీడియో, ఇ...