ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ఆవిష్కరణ పేమెంట్స్ వాచ్ !
నే షనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నాయిస్ కంపెనీ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తోంది. తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో దీన్ని పరిచయం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంటిగ్రేటెడ్ రూపే చిప్ ఉంటుంది. దీన్ని ధరించి మణికట్టు నుంచే 'మనీ' లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నమాట. పేమెంట్స్-కమ్-ఫిట్‌నెస్ సొల్యూషన్‌గా వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో హెల్త్, ఫిట్‌నెస్ మానిటరింగ్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్, 'ఆన్ ద గో' పేమెంట్స్ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌సీఎంసీ ఇంటిగ్రేషన్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ట్యాప్ అండ్ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా దీని ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్ చేయొచ్చు. ఇక హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్ల విషయానికి వ...