Posts

Showing posts with the label పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్

రేషన్ బియ్యం కుంభకోణాన్ని సీబీఐతో విచారణ జరిపించాలి !

Image
కా కినాడ పోర్టులో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేతపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలింపు వెనుక పెద్ద మాఫియా ఉందని, ఇదో పెద్ద జాతీయ స్థాయి కుంభకోణమన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. 'రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా. ఇదో జాతీయ స్థాయి కుంభకోణం. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉంది. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉంది. ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళుమూసుకుంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అక్రమ బియ్యాన్ని పట...