పిల్లల కోసం బోట్ వండరర్ స్మార్ట్ వాచ్ !
పి ల్లల కోసం ప్రత్యేకంగా బోట్ వండరర్ పేరుతో ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం బోట్ ఓ వాచ్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్‌లో 1.4 హెచ్‌డీ డిస్‌ప్లేనును అందించారు. చిన్నారులకు స్క్రీన్ స్పష్టంగా కనిపించేందుకు గాను క్రిస్టల్ క్లియర్ విజువల్స్‌ను అందించారు. ఈ స్మార్ట్ వాచ్ 4జీ సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఈ వాచ్‌ను వాటర్ ప్రూఫ్‌గా అందించారు. సిమ్ సపోర్ట్ ఉన్న కారణంగా ఈ వాచ్‌కు నేరుగా వీడియో కాల్ చేసుకోవచ్చు. దీంతో మీ పిల్లలు ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. అందుకోసం ఇందులో 2 మెగాపిక్సెల్ కెమెరాను కూడా ఇచ్చారు. అలాగే మీ చిన్నారులు ఎక్కడున్నారో లొకేషన్‌ను కూడా తెలుసుకోవచ్చు. కేవలం వీడియో కాల్ మాత్రమే కాకుండా ఆడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఇందులోని ఎస్‌ఓఎస్ కాలింగ్ ఆప్షన్‌తో పవర్ బటన్‌ను రెండు స్లారు లాంగ్ ప్రెస్ చేస్తే చాలు వెంటనే ఎంపిక చేసుకున్న నెంబర్‌కు ఫోన్ కాల్ వెళ్తుంది. ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ వాచ్ పేరెంట్స్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్‌ను కనెక్ట్ చేయడం ద్వారా ఈ వాచ్‌ను పెద్దలే కంట్రోల్ చేసుకోవచ్చు. అవసరం లేని సమయంలో వాచ్ పనిచేయకుండా ఫోన్ ద్వ...