పశువులకూ సరోగసీ!
పశువుల్లోనూ అద్దె గర్భం ద్వారా సంతాన ఉత్పత్తికి శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరులోని లాం పరిశోధన కేంద్రంలో ఈ ప్రయోగం అమలు చేస్తుండగా తాజాగా ప్రకాశం జిల్లా చదలవాడ పశు క్షేత్రంలోనూ ఉత్తమమైన ఒంగోలు ఆవుల జాతిని వృద్ది చేసేందుకు అధికారులు ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ల ద్వారా ఆవులు గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో ఆవు తన జీవితకాలంలో 9 నుంచి 15 దూడల వరకు జన్మనిస్తుంది. వాటి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు. అందుకు మనుషుల్లో అవలంబిస్తున్న సరోగసీ విధానాన్ని పశువుల్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. అంతరించిపోతున్న ఒంగోలు, పుంగనూరు లాంటి జాతుల పశువుల సంతతిని పెంచేందుకు 'ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్' సాంకేతికతను చదలవాడ పశుక్షేత్రంలో వినియోగిస్తున్నారు. నాణ్యమైన పశువు జాతిల నుంచి వీర్యాన్ని సేకరించి పిండాభివృద్ధి చేస్తున్నారు. దీన్ని పశువుల గర్భంలోకి ఎక్కించి దూడలకు జన్మనిచ్చేలా చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఒక్కో ఆవు తన జీవితకాలంలో దాదాపు 50 దూడల వరకు జన్మనిచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు ...