Posts

Showing posts with the label నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సరికొత్త ఆవిష్కరణ పేమెంట్స్‌ వాచ్‌ !

Image
నే షనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నాయిస్ కంపెనీ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తోంది. తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో దీన్ని పరిచయం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంటిగ్రేటెడ్ రూపే చిప్ ఉంటుంది. దీన్ని ధరించి మణికట్టు నుంచే 'మనీ' లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నమాట. పేమెంట్స్-కమ్-ఫిట్‌నెస్ సొల్యూషన్‌గా వస్తున్న ఈ స్మార్ట్‌ వాచ్‌లో హెల్త్‌, ఫిట్‌నెస్ మానిటరింగ్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్‌, 'ఆన్‌ ద గో' పేమెంట్స్‌ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌సీఎంసీ ఇంటిగ్రేషన్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ వాచ్‌ ట్యాప్ అండ్‌ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా దీని ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్‌ చేయొచ్చు. ఇక హెల్త్‌, ఫిట్‌నెస్‌ ఫీచర్ల విషయానికి వ...