దేశీయ మార్కెట్లో 'మోటోరోలా' కొత్త ఫోల్డబుల్ ఫోన్ విడుదల !
మో టోరొలా నుంచి మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్ రేజర్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ అయింది. 20 నుంచి అమెజాన్, రిలయన్స్ స్టోర్ సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. జులై 10 నుంచి ప్రీ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ రంగుల్లో లభించనుంది. మోటోరోలా రేజర్ 50 అల్ట్రా 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజీ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే విడుదల సందర్భంగా రూ.5,000 రాయితీ లభించనుంది. ఇక ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5,000 అదనపు రాయితీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ ఫోన్ రూ.89,999కు మీకు లభిస్తుంది. ఫోన్‌తో పాటు మోటోరొలా కంపెనీ కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను ఇస్తోంది. రిటైల్ బాక్స్‌లో ఫోన్ కేస్ కూడా ఉండడం విశేషం. మోటోరోలా రేజర్ 50 అల్ట్రా క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్‌తో వస్తోంది. గత వెర్షన్‌తో పోలిస్తే ఈ స్క్రీన్ పెద్దగా, సన్నగా ఉంది. ప్రధాన డిస్‌ప్లే ఫుల్‌హెచ్‌డీ+ పీఓలెడ్, 165Hz రీఫ్రెష్ రేటుతో 6.9 ఇంచెస్ పరిమాణంలో ఉంది. బయటి తెర నాలుగు ఇంచెస్ పరిమాణంలో ఎల్‌టీపీఓ, ఫ్లెక్సిబుల్ అమోలెడ్,...