Posts

Showing posts with the label దేశంలో అతి పెద్ద డేటా సెంటర్‌కి శంకుస్థాపన

దేశంలో అతి పెద్ద డేటా సెంటర్‌కి శంకుస్థాపన

Image
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో డేటా సెంటర్‌కి ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ విశాఖపట్నంలో 300 మెగావాట్ల డేటాసెంటర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. విశాఖ ప్రగతిలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. డేటా సెంటర్‌ ఏర్పాటులో భాగంగా సింగపూర్‌ నుంచి సబ్‌మెరైన్‌ కేబుల్‌ ఏర్పాటు చేస్తారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, వినియోగం, ఇంటర్నెట్‌ స్పీడ్ గణనీయంగా పెరుగుతుందన్నారు. డేటా డౌన్లోడ్‌, అప్‌లోడ్‌ శరవేగంగా జరుగుతాయి. ఇది విశాఖ అభివృద్ధిని మరింత పెంచుతుంది. ఈ తరహా ఆధునిక సదుపాయావల్ల విశాఖ నగరం మహానగరంగా ఎదగడానికి దోహదపడుతుందన్నారు. దీనివలన 39 వేల మందికి ఉపాధి కలుగుతుందని, 21,800 కోట్ల పెట్టుబడి విశాఖకు రాబోతోందన్నారు. సహజనవనరుల ద్వారా లభించే విద్యుత్తునే ఈ డేటా సెంటర్‌కు వినియోగిస్తారని, 190 ఎకరాల భూమిని డేటా సెంటర్ కోసం కేటాయించాం. డేటా సెంటర్‌ పార్కుతోపాటు, ఐటీ సెంటర్‌ పార్కు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సదుపాయం, రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటవుతుంది. క్లౌడ్‌ సర్వీసులు కూడా మెరుగుపడతాయన్నారు. తద్వారా ఐటీ కార్యకలాపాలను వేగంగా ఊపందుకుంటాయని ముఖ్యమ...