Posts

Showing posts with the label దక్షిణ అర్ధగోళంలో సాయంత్రం కనిపిస్తుంది

17న ఆకాశంలో అద్భుతం !

Image
ఇ ప్పటికీ తెలియని అనేక రహస్యాలు ఈ విశ్వాంతరాలంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు ఈ రహస్యాలను ఛేదించడంలో నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా పరిష్కరించని అనేక రహస్యాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి ఆకాశ అద్భుతాల్లో ఒకటి కామెట్. కామెట్ అనేది తోక చుక్క. ఈ తోక చుక్క ఇప్పుడు ఆకాశంలో కనువిందు చేసేందుకు సిద్ధంగా ఉంది. జపాన్ ఖగోళ శాస్త్రవేత్త హిడియో నిషిమురా ఆగస్టు నెలలోనే కొత్త తోకచుక్కను కనుగొన్నారు. ఆస్ట్రోనామికల్ అసోసియేషన్ దీనికి నిషిమురా అని పేరు పెట్టింది. 400 సంవత్సరాల తరువాత, సెప్టెంబర్ 12 న.. ఈ తోకచుక్క భూమి నుండి 80 మిలియన్ కిలోమీటర్ల దూరంలో వెళుతుంది. ఈ తోకచుక్కను ఇవాళ చూడలేకపోతే.. మళ్లీ సెప్టెంబర్ 17న ఆ అవకాశం పొందుతారు. అప్పుడు కూడా మిస్ అయితే.. దానిని చూసేందుకు మరో 400 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది.  కామెట్ అనేది ధూళి, మంచు, వాయువుల మిశ్రమంతో ఏర్పడిన సౌర వ్యవస్థలోని ఓ రాయి. ఇవి గ్రహాల వలె సూర్యుని చుట్టూ తిరుగుతాయి. కానీ వాటి మార్గం చాలా తక్కువగా ఉంటుంది. ఇది 50 నుండి 400 సంవత్సరాలలో సూర్యుని చుట్టూ తన భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. భూమిపై నుంచి కనిపించిన చివరి...