బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు !
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు పంపారు. తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన పరవుకు నష్టం కలిగించాయని కేటీఆర్ ఆరోపించారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. బండి సంజయ్ ఈ నెల 19న తన పైన తప్పుడు ఆరోపణలు చేసారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని బండి సంజయ్ నిరాధారణ ఆరోపణలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా బండి సంజయ్ ప్రస్తావరించారని వివరించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ ఆరోపణలు చేయటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. సంజయ్ కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో అభ్యంతరం వ్యక్తం చేసారు. తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకే బండి సంజయ్ ఉద్దేశ పూర్వకంగా అర్దం లేని ఆరోపణలు చేసారని కేటీఆర్ పేర్కొన్నారు.కేసుల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష...