Posts

Showing posts with the label డిసెంబర్‌ 6న సూర్యుడి గుండ్రటి తొలి చిత్రాన్ని తీసిందని ఇస్రో తెలిపింది

సూర్యుడ్ని ఫొటో తీసిన ఆదిత్య ఎల్‌-1

Image
ఆ దిత్య ఎల్‌-1 సూర్యుడ్ని తొలిసారి ఫొటో తీసింది. ఆ చిత్రాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రవారం విడుదల చేసింది. సూర్యుడి గురించి పరిశోధనల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌ 2న తొలి సన్‌ మిషన్‌ ఆదిత్య ఎల్‌-1ను ఇస్రో లాంచ్‌ చేసింది. నవంబర్‌లో అది సూర్యుడి సమీపానికి చేరుకుంది. దీంతో ఆదిత్య-ఎల్1లో ఉన్న సోలార్ అల్ట్రావైలైట్‌ ఇమేజింగ్ టెలిస్కోప్ (ఎస్‌యూఐటీ)ను నవంబర్‌ 20న యాక్టివేట్‌ చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 6న సూర్యుడి గుండ్రటి తొలి చిత్రాన్ని తీసిందని ఇస్రో తెలిపింది. ఆ ఫొటోను శుక్రవారం విడుదల చేసింది. సౌర పరిశీలన, పరిశోధనలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించింది. కాగా, ఎస్‌యూఐటీ ద్వారా 200 నుంచి 400 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో సూర్యుడు కనిపించే ఉపరితలం, దానిపై ఉండే పారదర్శక పొరకు సంబంధించిన సన్‌ ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ చిత్రం చాలా అద్భుతంగా ఉందని ఇస్రో తెలిపింది. సూర్య కిరణాలు, సోలార్‌ స్పాట్‌లు, సోలార్‌ రేడియేషన్‌ను అధ్యయనం చేయడానికి ఈ పొరలు కీలకమని వివరించింది. అంతరిక్ష వాతావరణం, భూమి వాతావరణంపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. సూర్యుడి వాతావరణానికి సంబంధించిన వివరణాత్మక పరిశీలన క...