Posts

Showing posts with the label డినో గేమ్ దానికదే కంటిన్యూగా ఆడేలా ఒక కోడింగ్ క్రియేట్ చేశాడు

జాబ్‌కు అప్లై చేయకుండానే గూగుల్ నుంచి పిలుపు !

Image
గూగుల్ సంస్థలో ఉద్యోగం కొట్టాలని, కనీసం ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. కానీ కొంతమంది కలలు మాత్రమే నిజమవుతాయి. గూగుల్ లో జాబ్ కొట్టడం కోసం సీవీలు, రెస్యూమేలు పంపిస్తూనే ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతారు. అలా అయిన వారే ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్లిన కొంతమంది మాత్రమే జాబ్ కొడతారు. కానీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ మాత్రం రెస్యూమే పంపలేదు, కనీసం ఇంటర్వ్యూకి అప్లై చేయలేదు. కానీ గూగుల్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అంతేనా అతనికి సూటయ్యే పోస్ట్ ఇస్తామని గూగుల్ తెలిపింది. అతని పేరు అక్షయ్ నరిశెట్టి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ అంటే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. తన ప్రాజెక్ట్ కోసం గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ లో ఇంటర్నెట్ లేనప్పుడు కనిపించే డినో గేమ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆన్ లైన్ లో కూడా ఈ గేమ్ ఆడుకోవచ్చు. డినో గేమ్ అంటే ఒక డైనోసర్ ఎదురుగా కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. కీబోర్డ్ లో స్పేస్ బార్ లేదా డౌన్ ఏరో కీ నొక్కడం ద్వారా అడ్డంకులను దాటుతుంది. అయితే అక్షయ్ చేతులతో కీ బోర్డు టచ్ చేయకుండా డినో గేమ్ దానికదే కంటిన్యూగా ఆడేలా ఒక కో...