మెడకు చిప్‌తో భారత్‌లోకి బంగ్లాదేశ్ రాబందు !
జా ర్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని విష్ణుగఢ్, కోనార్ డ్యామ్ వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన చిప్‌తో కూడిన రాబందును పట్టుకున్నారు. దాని కాలిపై ఒక లోహపు ఉంగరం కూడా ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా పేరు, సంఖ్య ఉన్నాయి. ప్రస్తుతం విష్ణుగఢ్‌లో సురక్షితంగా ఈ పక్షి ఉంది. అలాగే, దానిపై ఉన్న చిప్, మెటాలిక్ రింగ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. చిప్ ఉన్న రాబందును గుర్తించినట్లు ఎస్పీ అరవింద్ సింగ్ తెలిపారు. అంతరించిపోతున్న ఈ పక్షిపై ట్రాకింగ్ కోసం ఈ చిప్‌ను అమర్చి ఉంటారని భావిస్తున్నారు. ఈ రాబందు చాలా దూరం ప్రయాణించి హజారీబాగ్‌కు చేరుకుందని సేవ్ ఏషియన్ రాబందు ఫ్రం ఎలిమినేషన్ సభ్యుడు డాక్టర్ సత్యప్రకాశ్ తెలిపారు. అలసిపోయి అనారోగ్యంతో ఉన్నట్టుగా ఉందని చెప్పారు. దారిలో ఆహారం దొరకకపోయి ఉండవచ్చని, లేదా డైక్లోఫెనిక్ మందు ఉన్న మాంసాన్ని తిని ఉండొచ్చని అన్నారు. ఈ రాబందును బంగ్లాదేశ్ సోలార్ రేడియో కాలర్‌ను అమర్చినట్లు గుర్తించామని హజారీబాగ్ ఈస్ట్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ తెలిపారు. నిపుణులను సంప్రదించినప్పుడు ఈ పక్షిని వైట్ బ్యాక్డ్ రాబందుగా గుర్తించారు. ఈ రాబందు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్-1 కేటగిరీ కింద...