Posts

Showing posts with the label టైమ్ ల్యాప్స్ వీడియోను సిద్ధం చేసినట్టు నాసా వెల్లడి

గ్రహ శకలాల ముప్పుని తప్పించుకోగలమా ?

Image
మన సౌర వ్యవస్థ గ్రహ శకలాల వ్యర్థాల మయం. గ్రహం ఆవిర్భవించిన తొలినాటి నుంచీ ఆ శకలాలు అలాగే ఉండిపోయాయి. భూమికి పొరుగునున్న గ్రహం చుట్టూ దాదాపు 31,360 గ్రహ శకలాలు సంచరిస్తున్నాయి. వీటిలో చాలా గ్రహ శకలాలపై ముఖ్యంగా కిలోమీటర్ పరిమాణం ఉన్న గ్రహ శకలాలపై మనకు అదుపు ఉన్నప్పటికీ అవి కానీ భూమిని ఢీకొంటే మానవజాతి మొత్తం నశించిపోతుంది. అయితే చాలా గ్రహ శకలాలు బాగా చిన్నవి. వీటిని కనుగొనడం చాలా కష్టం. పదేళ్ల క్రితం 18 మీటర్ల పొడవున్న గ్రహశకలం మన వాతావరణంలో రష్యా లోని చెల్యాబిన్‌స్క్ మీద పేలిపోయింది. వీటి ప్రమాద ప్రకంపనలు వేల కొలది కిటికీలను నాశనం చేశాయి. పెద్ద విధ్వంసం సృష్టించాయి. 1500 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. డైమార్ఫోస్ వంటి 150 మీటర్ల పొడవున్న గ్రహశకలం మన నాగరికతను తుడిచిపెట్టలేదు. కానీ సామూహిక ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాంతీయ విధ్వంసం సంభవిస్తుంది. ఏదెలాగైనా ఈ చిన్నపాటి అంతరిక్ష శిలలను కనుగొనడం చాలా కష్టం. ఇలాంటి వాటిలో 40 శాతం వరకే ఇప్పటివరకు మనం కనుగొనగలిగామని భావిస్తున్నారు. భూమిని ఢీకొనే ఈ పరిమాణం కలిగిన గ్రహ శకలాన్ని మనం కనుగొనగలమా ? వేరే దారికి దాన్ని మళ్లించగలమా ? విపత్తు నుంచి దూరంగా...