Posts

Showing posts with the label జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి ? అవి ఎలా పనిచేస్తాయి ?

వైద్యశాస్త్రంలో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి !

Image
వై ద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ అసెంబ్లీ వెల్లడించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొనడంతో పాటు ట్రాన్స్‌క్రిప్షన్ తర్వాత జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో దాని పాత్ర గురించి తెలుసుకున్నందుకు వారిద్దరికి సంయుక్తంగా నోబెల్ బహుమతిని అనౌన్స్ చేశారు. జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి ? అవి ఎలా పనిచేస్తాయి ? అనే అంశాలతో ముడిపడిన ప్రాథమిక సమాచారాన్ని విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌ గుర్తించగలిగారని నోబెల్ అసెంబ్లీ వెల్లడించింది. 'మైక్రో ఆర్ఎన్ఏ' అనేది .. మన శరీరంలోని జన్యువుల పనితీరును నియంత్రించడంలో దోహదపడే కీలకమైన అణువు (మాలిక్యూల్). మైక్రో ఆర్ఎన్ఏను తాజాగా విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లు గుర్తించారు. మన శరీరంలోని అన్ని కణాల్లోనూ ఒకే రకమైన జన్యువులు ఉంటాయి. అయితే కణాలు మాత్రం భిన్నమైనవి ఉంటాయి. కండరాలు, నరాల్లో వేర్వేరు రకాల కణాలు ఉంటాయి. ఎందుకంటే శరీరంలోని ఒక్కో భాగం ఒక్కో రకమైన పనిచేస్తుంది. అందుకు అనుగుణమైన రకాలకు చెందిన కణాలు వాటిలో ఇమిడిపోయి ఉంటాయి. జీన్ రెగ్యులేషన్ అనే ప్రక్రియ వల్ల మన శరీరంలోని వివిధ భాగాల...