108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై ఇస్రో శిక్షణ !
భా రత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో ముందడగు పడింది. అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు శక్తిశాట్ అనే మిషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికార పోస్టర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్వరలో ఆవిష్కరించనున్నారు. ఈ శక్తిశాట్ మిషన్ ద్వారా 108 దేశాలకు చెందిన 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న 12,000 మంది హైస్కూల్ విద్యార్థినులకు స్పేస్ టెక్నాలజీ, పేలోడ్ అభివృద్ధి, వ్యోమనౌక వ్యవస్థల గురించి ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. బ్రిటన్, యూఏఈ, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక తదితర దేశాలు ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. శిక్షణ అనంతరం ప్రతి దేశం నుంచి ఒక విద్యార్థిని చొప్పున 108 మందిని ఎంపిక చేస్తారు. వీరికి పేల...