శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ పోన్లు విడుదల
దేశీయ మార్కెట్‌లోకి శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లు విడుదల చేసింది. ఈ ఫోన్లను ఏ34, ఏ54 5జీ ఫోన్లు ఈ నెల 28 నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ల కొనుగోలుతో రూ.3000 క్యాష్‌బ్యాక్ లేదా రూ.2500 విలువైన అప్‌గ్రేడ్ బోనస్, రూ.900 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ పొందొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34, శాంసంగ్ గెలాక్సీ ఏ54 ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లతోనూ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్ పొందొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్ నాలుగు రంగుల్లో, శాంసంగ్ గెలాక్సీ ఏ54 ఫోన్ మూడు రంగుల్లో వినియోగదారులకు లభ్యం అవుతుంది. ఏ34 వేరియంట్ లైమ్, గ్రాఫైట్, వయోలెట్, సిల్వర్ రంగుల్లోనూ, ఏ54 వేరియంట్ లైమ్, గ్రాఫైట్, వయోలెట్ రంగుల్లో కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ ఏ54 5జీ వేరియంట్ 8జీబీ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజీ మోడల్ రూ.38,999, 8జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ మోడల్ ధర రూ.40,999లకు లభిస్తుంది. ఇక శాంసంగ్ ఏ34 వేరియంట్ ఫోన్ 8జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మోడల్ రూ.30,999, 8జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల మోడల్ ఫోన్ రూ.32,999లకు కొనుగోలు ...