విక్స్ బహుళ ప్రయోజనకారి !
విక్స్ కేవలం దగ్గు, జలుబుకే కాదు, ఇంకా ఇతర పనులకు కూడా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రెబ్బలపై కొద్దిగా విక్స్ రాసి వాటిని ముక్కు వద్ద పెట్టుకుని గట్టిగా శ్వాస పీల్చాలి. దీంతో సైనస్ తలనొప్పి తగ్గిపోతుంది. కొద్దిగా విక్స్‌ను తీసుకుని దానికి కొంత వేజలిన్ కలపాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి లేదంటే బట్టలకు రాసుకుంటే దోమలు కుట్టవు. రోజుకు కనీసం మూడుసార్లు విక్స్‌ను మొటిమలపై క్రమం తప్పకుండా రాస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి. కొద్దిగా విక్స్‌ను తీసుకుని చెవుల వెనుక, మోచేతులపై, మెడపై, మోకాళ్లపై రాసుకుంటే కీటకాలు, పురుగులు, ఈగలు వాలవు. విక్స్ డబ్బాను ఓపెన్ చేసి ఆహార పదార్థాలకు సమీపంలో ఉంచితే ఈగలు వాలవు. గాయం అయిన చోట విక్స్ రాస్తే త్వరగా ఆ గాయం తగ్గిపోతుంది. శరీరంలో కండరాలు నొప్పులు ఉంటే ఆ ప్రదేశాల్లో విక్స్‌ను రాసి బాగా మర్దనా చేయాలి. అనంతరం టవల్‌తో గట్టిగా వేడి ఉండేలా చుట్టాలి. దీంతో కండరాల నొప్పులు తగ్గిపోతాయి. చర్మం తడి ఆరిపోయి పొడిగా మారి ఇబ్బందులు పెడుతుంటే విక్స్ రాయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. విక్స్, మెంథాల్, కర్పూరంలను బాగా కలిపి మోచేతిపై పెట్టుకుంటే టెన్నిస్ ఎల్బో సమస్య ఉండదు. రాత్రి ప...