గూగుల్ మ్యాప్స్‌లో 'ట్రైన్ లైవ్ లొకేషన్' ఫీచర్ !
గూ గుల్ మ్యాప్స్‌లో 'ట్రైన్ లైవ్ లొకేషన్' ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ యాడ్ చేయనుంది. ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్ అనేది 'where is my train' యాప్‌కు కనెక్ట్ అయి పనిచేస్తుంది. ఈ కొత్త ఫీచర్ 2024 సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుంది. వాహనదారుల ఇంధన ఖర్చులను ఆదా చేసే ఫీచర్లను కూడా గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. వాహనం ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి నిర్దిష్ట మార్గంలో ఎంత ఇంధనం ఖర్చవుతుందనే విషయాన్ని ఈ ఫీచర్ తెలియజేస్తుంది. ఏఐ టెక్నాలజీతో గూగుల్ లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్లు, రూట్ సమాచారాన్ని కూడా వాహనదారులు గూగుల్ మ్యాప్స్‌లో చూడొచ్చు. చాలామంది వ్యక్తులు ఎవరికైనా చిరునామా ఇవ్వడానికి చిన్న ల్యాండ్ మార్కులను వాడతారు. ఇకపై ఇదంతా గూగుల్ నుంచే పని చేస్తుంది. మ్యాప్‌లో మీరు ఇచ్చిన అడ్రస్‌కు సమీపంలో Google 5 ల్యాండ్ మార్కులు, ఏరియా పేర్లను చూపిస్తాయి. దీని నుంచి అడ్రస్ ఎక్కడ ఉందో యూజర్లు ఈజీగా అర్థం చేసుకుంటారు. సాధారణంగా భారతీయులు తాము వెళ్ల...