Posts

Showing posts with the label గుడ్‌బై ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ !

గుడ్‌బై ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ !

Image
ఇప్పుడంటే గూగుల్‌ క్రోమ్‌ ఓపెన్ చేసి మనకు కావాల్సింది వెతుక్కుంటున్నాం కానీ ఓ 15 ఏళ్ల క్రితం అందరూ ఒకే బ్రౌజర్‌ని వినియోగించే వారు. ఆ బ్రౌజరే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. e సింబల్‌తో కనిపించే ఈ బ్రౌజర్ అప్పట్లో చాలా ఫేమస్.  డెస్క్‌టాప్‌ కొనుగోలు చేసిన వాళ్లకి విండోస్‌ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పాటు డిఫాల్ట్‌గా ఈ బ్రౌజర్ వచ్చేది. అప్పటికి మిగతా బ్రౌజర్లు రాకపోవటం వల్ల అందరూ దీన్ని వినియోగించేవాళ్లు. ఈ జనరేషన్ వాళ్లకి పెద్దగా తెలియకపోయినా 1990ల్లోని వాళ్లకి ఇది చాలా సుపరిచితం. ఎప్పుడైతే గూగుల్‌ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి క్రమంగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్క నుమరుగైంది. ఇది గమనించిన మైక్రోసాఫ్ట్ సంస్థ 27 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్రౌజర్‌ని పూర్తిగా తొలగిస్తున్నామంటూ ప్రకటించింది. ఈ వార్త విన్నప్పటి నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అభిమానులంతా ఎమోషనల్ అయిపోతున్నారు. మిస్‌ యూ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం మనం వినయోగిస్తున్న బ్రౌజర్ల యూజర్ ఇంటర్‌ఫేస్‌కి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఇంటర్‌ఫేస్‌కి చాలా తేడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో గవర్నమెంట్‌కి సంబంధి...