ఓజోన్ పొరకు భారీ రంధ్రాలు ?
మానవుడు నాగరికత, ఆధునిక విజ్ఞానం, టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి అంటూ.. ప్రకృతికి దూరంగా.. కృతిమాలకు దగ్గరగా జీవించడం మొదలు పెట్టాడు తన వేలుతో తన కన్ను పొడుచుకున్న చందంగా మనిషి ఆధునికత పేరుతో చేపడుతున్న పనులు.. ఉపయోగిస్తున్న ఎలక్రికల్ వస్తువులు తదితరాలు అతిప్రమాదానికి కారణమౌవుతున్నాయి. తాజాగా పర్యావరణవేత్త పరిశోధనలో ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు ఓజోన్ వాయువు పొరలో పెద్ద రంధ్రం కనుగొన్నారు. ఈ ఓజోన్ పొర భూమిని చుట్టుముట్టి ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది. AIP అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన కథనం ప్రకారం మానవుడిని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ లేయర్ కు భారీ రంధ్రాన్ని సైంటిస్టులు గుర్తించారు. గతంలో అంటార్కిటికా ప్రాంతంలో గుర్తించిన దాని కన్నా ఇది 7 రెట్లు పెద్దదిని కెనడాలోని వాటర్లు విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త క్వింగ్-బిన్ లూ చెప్పారు. కొత్తగా కనుగొనబడిన ఈ ఓజోన్ రంధ్రం ఉష్ణమండలంపై గత 30 సంవత్సరాలకు పైగా ఉందని తెలిపారు. ఈ రంధ్రం దిగువ స్ట్రాటో ఆవరణంలో ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఓజోన్ పొర.. మ...