Posts

Showing posts with the label కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు దిశా నిర్దేశం

కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు దిశా నిర్దేశం !

Image
ఆం ధ్రప్రదేశ్ లో కూటమి అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని అభిప్రాయపడిన చంద్రబాబు, విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పని చేశారని అన్నారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ ఏజెంట్లు పని చేయాలని సూచించారు. కౌంటింగ్ రోజున వైసీపీ విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఇప్పటికే ఆ పార్టీ అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేస్తోందని అన్నారు. ప్రతి నియోజవర్గ పరిధిలో కూటమి నేతలు తమ నాయకులు కార్యకర్తలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో జగన్ తిరకాసు పెట్టేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. అందుకే, ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, విజయం సాధించిన తరువాత డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రావాలని స్పష్టం చేశారు.