Posts

Showing posts with the label కేసీఆర్

అగ్ని పర్వతంలా రగిలిపోతున్నా : కేసీఆర్

Image
తె లంగాణ భవన్‌లో జరిగిన ఈ బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్‌ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్‌ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?....

కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు !

Image
తె లంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ జరిగితే కచ్చితంగా జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ విషయం ఆటకెక్కించే కుట్ర జరుగుతుందని ఎంపీ సంజయ్ తెలిపారు. ప్రధానంగా రాజకీయాల ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై విచారణ జరుగకుండా ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. భారీగా డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తుంది. కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులను ప్రకటించాలని.. స్పీకర్ కి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఫోన్ టయాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. సీబీఐని నిషేదిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.