Posts

Showing posts with the label కేవలం రూ.3

రాజకీయ నాయకుల ఒత్తిడి, జోక్యంతో తన కంపెనీని కోల్పోయా !

Image
రా జకీయ నాయకుల ఒత్తిడి, జోక్యంతో తన కంపెనీని కోల్పోయానని, తక్కువ మొత్తానికి అమ్మేసుకున్నానని ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు చిన్నకన్నన్ శివశంకరన్ పేర్కొన్నారు. దశాబ్దం క్రితంతో పోలిస్తే నేటి భారతదేశం చాలా భిన్నంగా ఉందని చెప్పారు. అప్పట్లో వ్యాపారాలు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయని ఒక పాడ్‌కాస్ట్‌ షోలో మాట్లాడుతూ చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా విజయవంతమైతే అదొక సమస్యగా ఉండేదన్నారు. 'రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారు.. నేను నా కంపెనీని కోల్పోయాను' అని చెప్పుకొచ్చారు. తాను కేవలం రూ.3,400 కోట్లకే కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చిందని, అదే ఏటీఅండ్‌టీకి అమ్మి ఉంటే తనకు 8 బిలియన్‌ డాలర్లు ఆదాయం వచ్చేదని చెప్పారు. ఇప్పట్లా అప్పుడు లేదు. ఒక పారిశ్రామికవేత్త తన కంపెనీని ఒక నిర్దిష్ట వ్యక్తికే విక్రయించాలని ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. 2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీ ఈస్ట్, పశ్చిమబెంగాల్ వంటి 13 సర్కిళ్లలో స్పెక్ట్రమ్ కోసం ఎయిర్‌సెల్ రూ. 6,5...