శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ మార్కెట్లోకి విడుదల
శాంసంగ్ సంస్థ ఇటీవల మూడు “ఏ” సిరీస్ స్మార్ట్ ఫోన్లను భారత్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గెలాక్సీ ఏ53 5జీ, ఏ73 5జీ ఏ33 5జీ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మార్చి మొదటి వారంలో విడుదలైన ఈ ఫోన్ల అమ్మకాలు మాత్రం మార్చి మూడో వారం తరువాత ప్రారంభం అవుతాయని శాంసంగ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏ53 5జీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సోమావారం నుంచి అధికారకంగా ప్రారంభమైనట్లు శాంసంగ్ సంస్థ తెలిపింది. వినియోగదారులు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ద్వారాగానీ, నేరుగా శాంసంగ్ షోరూమ్, వెబ్ సైట్లలో గానీ ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. ధర విషయానికొస్తే 6 + 128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ .34,499గానూ 8 + 128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ .35,999గానూ నిర్ణయించారు. శామ్సంగ్ గెలాక్సీ ఎ53 5జి బ్లాక్, వైట్, లైట్ బ్లూ మరియు పీచ్ అనే నాలుగు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో వస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ఫోన్లో 6.5 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉన్నాయి. గెలాక్సీ ఎ-సిరీస్లో మొదటిసారిగా 5Nm ఎక్సినోస్ 1280 చిప్ సెట్ ను అమర్చారు. ఈ ఫోన్ ర...