యూట్యూబ్ సొంత షాపింగ్ ఛానెల్ !
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ యాప్ అఫీషియల్‌గా సొంత షాపింగ్ ఛానెల్ ప్రారంభించనుంది. దక్షిణ కొరియాలో జూన్ 30న లాంచ్ కానున్న ఈ షాపింగ్ ఛానెల్ వివిధ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ విక్రయించడానికి లైవ్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. మొదట ఈ ఛానల్ దాదాపు 30 బ్రాండ్‌లకు చెందిన ప్రొడక్ట్స్‌ను కంపెనీ లైవ్‌లోకి తీసుకురానుంది. యూట్యూబ్ తొలిసారిగా లైవ్ షాపింగ్ ఛానల్‌ను ప్రారంభిస్తుండగా అందులో యూజర్లకు ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయనేది ఇంకా తెలియ రాలేదు. ఇటీవల ఒక యూట్యూబ్ ప్రతినిధి దీని గురించి మాట్లాడుతూ, వివిధ షాపింగ్ ఫీచర్లతో ప్రయోగాలు చేస్తూ బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. యూట్యూబ్ యూజర్లకు షాపింగ్‌ను సులభతరం చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిప్రాయపడ్డారు. ప్రకటనకర్తలు తమ వ్యయాన...