Posts

Showing posts with the label ఎడిటింగ్ యాప్

గూగుల్‌లో కొత్త ఇమేజ్ టూల్స్, ఎడిటింగ్ యాప్

Image
గూ గుల్ తాజాగా 'అబౌట్ దిస్ ఇమేజ్' అనే టూల్, 'యూట్యూబ్ క్రియేట్' అనే యాప్‌లను తీసుకొచ్చింది. ఇంటర్నెట్లో ఏదైనా డేటా లేదా న్యూస్.. కరెక్టా? కాదా? అన్నది గూగుల్ ద్వారా తెలిసిపోతుంది. కానీ, ఇంటర్నెట్‌లో కనిపించే రకరకాల ఫోటోల గురించి నిజానిజాలు ఎవరికీ తెలియవు. వాటికోసం ఇతర యాప్స్ లేదా టూల్స్‌పై ఆధారపడాలి. అందుకే దానికోసం గూగుల్ 'అబౌట్‌ దిస్ ఇమేజ్' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ టూల్ సాయంతో ఇంటర్నెట్‌లో కనిపించే ఇమేజ్ ఒరిజినల్ సోర్స్, కాంటెక్స్ట్, కంటెంట్ క్రెడిబిలిటీ వంటివి చెక్ చేయొచ్చు. గూగుల్ ఇమేజెస్ రిజల్ట్స్‌లో ఇమేజ్‌ పైన కనిపించే త్రీ డాట్స్‌ను క్లిక్ చేస్తే 'అబౌట్‌ దిస్ ఇమేజ్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఆ ఇమేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఆ ఇమేజ్ ఆరిజిన్ ఏంటి? ఎంత కాలం నాటిది? ఇమేజ్ మెటాడేటా, ఇమేజ్ పబ్లిషర్ ఎవరు? అది కెమెరాతో క్లిక్ చేసినదా? లేదా ఏఐతో క్రియేట్ చేసిందా? అనే వివరాలు తెలుస్తాయి.వీటితో పాటు ఫ్యాక్ట్ చెకింగ్ కోసం 'ఫేస్‌ చెక్ క్లెయిమ్ సెర్చ్' అనే మరో టూల్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్...