Posts

Showing posts with the label ఈ కొత్త ఫీచర్‌ యాప్‌లో కాల్ చేసినప్పుడు యూజర్ IP అడ్రస్‌ను దాచిపెడుతుంది

సైబర్‌క్రైమ్స్ ప్రోత్సహించేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ ?

Image
వా ట్సాప్ యూజర్లకు మెరుగైన ప్రైవసీ అందించడానికి సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. రీసెంట్‌గా ఆండ్రాయిడ్, iOS బీటా టెస్టర్లకు "ప్రొటెక్ట్ IP అడ్రస్ ఇన్ కాల్‌" పేరుతో మరో ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్‌ యాప్‌లో కాల్ చేసినప్పుడు యూజర్ IP అడ్రస్‌ను దాచిపెడుతుంది. దీనివల్ల యూజర్ల ప్రైవసీ మరింత ఇంప్రూవ్ కానుంది. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీచర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్పెసిఫికేషన్‌ వల్ల సైబర్ నేరగాళ్లు, ఉగ్రవాదులు పోలీసులు, చట్టం నుంచి తప్పించుకోవడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. IP అడ్రస్ అనేది ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లో ఒక యూజర్ డివైజ్‌ను ఐడెంటిఫై చేసే స్పెషల్ నంబర్. ఇది యూజర్ ఎక్కడ ఉన్నారో, వారి నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎవరో కూడా చూపుతుంది. వాట్సాప్‌లో ఎవరికైనా కాల్ చేసినప్పుడు, IP అడ్రస్ అవతలి వ్యక్తి IP అడ్రస్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ సమాచారం ఫోన్ మెటాడేటాలో స్టోర్ అవుతుంది. మెటాడేటా అనేది డేటాకు సంబంధించిన డేటా. ఇది యూజర్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కాల్ చేసా...