Posts

Showing posts with the label ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్

కొత్త ఫీచర్స్‌తో పెయిడ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్

Image
టెలిగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించబోతోంది. ఈ నెలలోనే పెయిడ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. టెలిగ్రామ్ ఫౌండర్ పవెల్ డురోవ్ అధికారికంగా ప్రకటించారు. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ గురించి తన టెలిగ్రామ్ అకౌంట్‌లో వివరించారు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ అయిన టెలిగ్రామ్‌లో ప్రీమియం మెంబర్‌షిప్ ప్రారంభించబోతున్నామని, ఈ నెలలోనే సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అసలు సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నామో, ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో కూడా వివరించారు. ప్రస్తుతం ఈ యాప్‌లో ఉన్న లిమిట్స్ పెంచాలని చాలామంది యూజర్లు కోరుతున్నారని, వారి డిమాండ్ల మేరకు అనేక రకాలుగా ప్రయత్నించామని, కానీ అందరికీ లిమిట్స్ తీసేస్తే వచ్చే ట్రాఫిక్‌ను సర్వర్లు తట్టుకోవడం కష్టమని, ఇందుకోసం అయ్యే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని పవెల్ డురోవ్ వివరించారు. అందుకోసమే ప్రీమియం మెంబర్‌షిప్   టెలిగ్రామ్  ప్రారంభించబోతోంది. యూజర్లు పెయిడ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే వారికి ఎలాంటి లిమిట్స్ ఉండవు. ప్రస్తుతం టెలిగ్రామ్ గ్రూప్‌లో 2,00,000 మంది వరకు సభ్యుల్ని చేర్చు...