2026 నాటికి ఓఎల్ఈడీ స్ర్కీన్‌తో ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ ?
ఆ పిల్ ఐప్యాడ్ ఎయిర్ ఓఎల్ఈడీ స్క్రీన్‌తో అప్‌గ్రేడ్ కానుంది. కంపెనీ లైనప్‌లో లిక్విడ్ రెటినా ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌లకు బదులుగా మెరుగైన డిస్‌ప్లే టెక్నాలజీతో అమర్చిన రెండో టాబ్లెట్‌గా రానుంది. కంపెనీ అప్‌గ్రేడ్ చేసిన ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌లలో డిస్‌ప్లేలకు సరఫరాదారుని కూడా ఎంపిక చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆపిల్ కొత్త టండెమ్ ఓఎల్ఈడీ టెక్నాలజీ, స్లిమ్ డిజైన్‌తో ఐప్యాడ్ ప్రోని ప్రవేశపెట్టింది. అయితే, ఐప్యాడ్ ఎయిర్ రెండు డిస్‌ప్లే సైజులలో కూడా వచ్చింది. ఆ ఐప్యాడ్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ది ఎలెక్ నివేదిక ప్రకారం ఓఎల్ఈడీ స్క్రీన్‌తో అప్‌గ్రేడ్ చేసిన ఐప్యాడ్ ఎయిర్ 2026 నాటికి ఆపిల్ ద్వారా లాంచ్ కానుంది. ఐఫోన్ తయారీదారు అదే సంవత్సరంలో 8.3-అంగుళాల లిక్విడ్ రెటినా ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగిన ఓఎల్ఈడీ స్క్రీన్‌తో ఐప్యాడ్ మినీ మెరుగైన వెర్షన్ కూడా లాంచ్ చేయాలని భావిస్తోంది. గత మేలో లాంచ్ అయిన లేటెస్ట్ ఐప్యాడ్ ప్రో మోడల్‌లో అడ్వాన్సడ్ టెన్డం ఓఎల్ఈడీ స్క్రీన్ అమర్చి ఉంటుంది. లో పవర్ వినియోగాన్ని కూడా అందిస్తుంది. అదే సమయంలో స్లిమ్మర్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను ఎనేబుల్ చేస్తుంది. మరోవైపు, ఐప్య...