మనసుకవి ఆత్రేయ
మనసుకవి ఆత్రేయ పాట రాసే విధానం చాలా వింతగా ఉంటుంది. పగలంతా పిచ్చాపాటీతో కాలం గడుపుతారు. డాన్ పీంచ్ సిగరేట్ పేకెట్లూ.. పళ్లెంలో ఆరారగా ప్రూట్సు.. ఇవివుండి తీరాలి. అసిస్టెంట్ డైరెక్టరు పాట రాయించుకోవడం కోసం వస్తాడు, పేపర్లూ పాడ్‌తో. పెన్నుతెరిచి మరీ రెడీగా వుంటాడు. ఆ పెన్ను అలాగే వుంటుంది. ప్రూట్సు ఒకటీ అరా అవుతాయి. సిగరెట్లు మొత్తం ఖాళీ అవుతాయి. ఆయన నిద్రలోకి జారుకుంటాడు. అంతే! మళ్లీ సాయంత్రం. ఫ్రెష్ష్‌గా స్నానం చెయ్యడంధవళ వస్త్రాలు ధరించడం.. సిగరెట్ వెలిగించడం. ‘‘ఎందాకా వచ్చాం?’’ ‘‘ఏదీ... మొదలు పెట్టందే!’’ ‘‘మొదలుపెడితే పాట పూర్తయినట్లే కదరా! ఆ మొదలు దొరకడం లేదు.’’ ‘‘ఓ మాట అనండి!’’ ‘‘వేడి కాఫీ చెప్పు!’’ ‘‘మాట అనమంటే ఇదా!’’ ఇలా వుంటుంది ఆయన ధోరణి. పాట పూర్తికాదు. గంటలు.. రోజులు.. వారాలు గడుస్తుంటాయి. ‘‘పాట’’ పుట్టదు. హోటలుకి అద్దె పెరిగిపోతుంది. ప్రొడ్యూసరు లబోదిబోమంటాడు. సరిగ్గా ఇలా జరిగింది, పద్మశ్రీ పి పుల్లయ్యగారి మురళీకృష్ణ చిత్రానికి. ఇద్దరిమధ్య మంచి చనువుంది. తిట్లూ- పొగడ్తలూ సర్వసాధారణం. ఆరోజు అమీతుమీ తేల్చుకోడానికి పుల్లయ్యగారొచ్చారు. ‘‘పాట వొచ్చిందా?’’ పుల్లయ్యగారు. ‘‘వొచ్చి చ...