కారులాంటి బైక్ ?
అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ పోలారిస్ ఈ మోటార్ సైకిల్ ని తయారు చేసింది. BikeWithGirl అనే యూట్యూబ్ ఛానల్‌లో దీనికి సంబంధించిన వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది చాలా విచిత్రంగా కనిపించే బైక్. ఈ బైక్‌ను రోడ్డుగా కనిపించే సమయంలో ప్రజలు మొదటగా దానిని సూపర్ కార్ అని అనుకున్నారు. కానీ స్లింగ్‌షాట్ రూపంలో ఉన్న ఈ బైక్ ముందు భాగంలో చాలా వెడల్పుగా వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అచ్చం పోర్షే 911 కారు లాగానే ఉంటుంది. అంతేగాక దీనిపై ప్రయాణించేటప్పుడు కారుపై వెళుతున్న అనుభూతిని రైడర్ పొందుతాడు.ఈ బైక్ ముందు భాగంలో రెండు చక్రాలు వెనుక భాగంలో ఒక చక్రాన్ని కలిగి ఉంటుంది. ఇంజన్ ద్వారా దీని వెనుక చక్రానికి పవర్ అనేది పంపబడుతుంది. ఈ బైక్ లో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో క్లామ్‌షెల్ బానెట్ పొందబడుతుంది. ముందు, వెనుక 18-ఇంచెస్ డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ ను కలిగి వుంది. అలాగే ఈ వాహనంని మోటర్ సైకిల్‌గా ఇంకా స్లింగ్‌షాట్‌లో ఇద్దరు వ్యక్తులు కూర్చునేలా డిజైన్ చేశారు.ఇక దీని సీట్ డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కారు లాంటి బైక్ లో ఇద్దరు పక్క పక్కనే కూర్చునేలా ఇది ...