14 నెలల్లోనే చాట్‌జీపీటీ దివాళా ?
చా ట్‌జీపీటీ దాదాపు ఏడాది క్రితం సెర్చింజన్ గూగులమ్మకు పోటీగా వచ్చింది . జాతీయ, అంతర్జాతీయ అంశాలపై 'గూగుల్' కంటే బెటర్‌గా యూజర్లకు కంటెంట్ అందుబాటులోకి తేవడంతో నెటిజన్లు మొదలు సెలబ్రిటీలు, కార్పొరేట్లు, ఒక్కరేమిటి ప్రతి ఒక్కరి దృష్టిచాట్‌జీపీటీపై మళ్లింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు సైతం చాట్‌జీపీటీ తరహాలో సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్‌బోట్‌లను అందుబాటులోకి తెచ్చాయి.. మరికొన్ని సంస్థలు ఆ ప్రక్రియలో బిజీబిజీగా గడుపుతున్నాయి.. కానీ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఆర్థిక పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగో లేదట. వచ్చే ఏడాది అంటే 2024లో దివాళా ప్రక్రియకు వెళ్లే అవకాశం ఉందని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ సంచలన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చాట్‌జీపీటీ నిర్వహణకు ఓపెన్ ఏఐ ప్రతి రోజూ సుమారు రూ.5.80 కోట్ల (ఏడు లక్షల డాలర్లు) నష్ట పోతున్నదని ఆ నివేదిక సారాంశం. ఓపెన్ ఏఐ ఆర్థిక వనరులు శరవేగంగా తగ్గిపోయాయని అనలిటిక్స్ ఇండియా పేర్కొంది. ఆదాయం పెంచుకోవడానికి జీపీటీ-3.5, జీపీటీ-4 వంటి పెయిడ్ సర్వీసులు ప్రారంభించింది ఓపెన్ ఏఐ. కానీ.. చాట్‌జీపీటీ ఖర్చులు భరించడానికి అవసరమైన ఆదాయం సం...