Posts

Showing posts with the label అదితి వివాహం

సంప్రదాయ పద్దతిలో సిద్ధార్థ్, అదితి వివాహం !

Image
టా లీవుడ్ హీరోహీరోయిన్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. 'నా సూర్యుడు నువ్వే, నా చంద్రుడు నువ్వే, నా నక్షత్రాలన్నీ నువ్వే' అంటూ అందమైన క్యాప్షన్ తో సిద్ధార్థ్ పై ప్రేమను వ్యక్తం చేసింది అదితి. ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి పెళ్లి ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతుండగా,  నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్, అదితి చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో తమ పెళ్లి కాలేదని, కేవలం నిశ్చితార్థం మాత్రం జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చార...