'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్'కు మంత్రివర్గం ఆమోదం !
'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్' పథకానికి ఇటీవల కేంద్రం మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వ విద్యాలయాలకు అంతర్జాతీయ స్థాయి అత్యున్నత ప్రమాణాలు కలిగిన మెటీరియల్ అందుబాటులో ఉంచాలని కేంద్రం భావించింది. ఇందుకోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పరిశోధకులకు వివిధ దేశాలకు సంబంధించిన వ్యాసాలు మరియు జర్నల్స్‌ను యాక్సెస్ చేయడానికి 'వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్' పథకాన్ని తీసుకొచ్చిది. ఇందుకుగాను 3 సంవత్సరాల్లో 6 వేల కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ అయింది. జాతీయ విద్యా విధానం 2020 మరియు అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యాలకు ఇది మద్దతు ఇస్తుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి కలిగిన అంతర్-విశ్వవిద్యాలయ కేంద్రమైన ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ దీని నిర్వహణ చేపట్టనుంది. జాతీయ సభ్యత్వం ద్వారా ఆయా డాక్యుమెంట్స్‌కు యాక్సెస్ అందించనుంది. ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ విధానంలో జరగనుంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు మరియు ఆర్ & డీ ప్రయోగశాలలు సహా అభివృద్ధి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ...