Posts

Showing posts with the label uttarpradesh

వారణాసి విమానాశ్రయంలో తుపాకీ మిస్ ఫైర్ : ఇద్దరికి తీవ్ర గాయాలు

Image
ఉ త్తరప్రదేశ్‌లోని వారణాసి విమానాశ్రయంలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ముంబై వెళ్లేందుకు తన భార్యతో కలిసి ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు తన వద్ద ఉన్న ఆయుధాన్ని డిక్లేర్ చేశారు. ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆ ఆయుధాన్ని తనిఖీ చేస్తుండగా అకస్మాత్తుగా మిస్ ఫైర్ అయింది. ఈ మిస్‌ఫైరింగ్ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న ఏఏఐసీఎల్‌ఏఎస్ భద్రతా తనిఖీ సిబ్బంది ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని విమానాశ్రయ డైరెక్టర్ వెల్లడించారు. బుల్లెట్ గాయాలైన ఇద్దరు సిబ్బందిని తక్షణమే సమీపంలోని న్యూ లక్ష్మి ట్రామా సెంటర్‌కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే విమానాశ్రయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన, కాల్పులు జరగడానికి గల ఖచ్చితమైన కారణాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కాసేపు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 

లక్నో కోచింగ్ సెంటర్ మూడు అంతస్తుల భవనం కూల్చివేతకు నోటీసులు జారీ

Image
ఉ త్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 15 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. లక్నోలోని అలీగంజ్ ఏరియాలో ఉన్న ఆ మూడు అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ కూల్చివేత ఆదేశాలు జారీ చేసింది. రెసిడెన్షియల్ బిల్డింగ్ పేరుతో ఉన్న ఆ భవనంలో కమర్షియల్ స్పేస్‌ను ఎలా నిర్మించాలని అధికారులు ఆరా తీస్తున్నారు. లక్నో మున్సిపల్ అధికారులపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్మయ్యారు. వాస్తవానికి ఆ బిల్డింగ్‌ను కూల్చివేయాలని 2016లో ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని నిర్మాణంగా భావిస్తూ ఆ ఆదేశాలు ఇచ్చారు. కానీ రెండు నెలల్లోనే మళ్లీ ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. అలీగంజ్ బిల్డింగ్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎల్‌డీఏ వైస్ చైర్మెన్ ప్రథమేశ్ కుమార్ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల దర్యాప్తు చేపట్టామని, త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ బిల్డింగ్‌లో ఉన్న యానిమేషన్ సెంటర్‌లో కోర్సులు నేర్చుకునేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు వస్తుంటారు. అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్ బృందం ఇవాళ ఉదయం ఆ ప్రదేశానికి చే...

రామమందిరంలో కోట్లాది రూపాయల కానుకలు అదృశ్యం : సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్

Image
అ యోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల కానుకలు అదృశ్యమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.''రామ మందిరానికి సమర్పించిన కోట్ల రూపాయల కానుకలు గల్లంతవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులకు అత్యంత సున్నితమైన వార్త. ఇది ఆలయ ట్రస్టుకు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ సనాతన సమాజానికి శ్రీరామునిపై ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ఇది నేరుగా సంబంధించిన విషయం కాబట్టి, కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించాలని అభ్యర్థిస్తున్నాము. ప్రభుత్వ మౌనం అనుమానాస్పదంగా ఉంది.'' అని ట్వీట్ చేశారు.ఎస్పీ అధినేత చేసిన ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పందించలేదు. ఈ వార్త వైరల్ అయిన తర్వాత ట్రస్ట్ నుంచి ఎలాంటి వివరణ, ఖండన రాలేదు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరికొన్ని నెలల్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్న నేపథ్యంలో అఖిలేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అద్దె అడిగినందుకు యజమానిని చంపిన దంపతులు : పట్టిచ్చిన పని మనిషి

Image
ఉ త్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో గత నాలుగు నెలలుగా పేరుకుపోయిన అద్దెను అడిగినందుకు ఓ జంట తమ ఇంటి యజమానిని దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా, పనిమనిషి అప్రమత్తతతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లోని రాజ్ నగర్ ఎక్స్టెన్షన్‌లోని 'ఆరా చిమెరా' రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో దీప్శిఖ శర్మ (48) అనే టీచర్ నివసించేవారు. అదే సొసైటీలో ఆమెకు మరో ఫ్లాట్ కూడా ఉంది. అందులో అజయ్ గుప్తా, ఆకృతి గుప్తా అనే దంపతులు అద్దెకు ఉంటున్నారు. అయితే గత నాలుగు నెలలుగా వారు అద్దె చెల్లించకపోవడంతో బుధవారం మధ్యాహ్నం దీప్శిఖ వారిని అడిగేందుకు ఒంటరిగా వారి ఫ్లాట్‌కు వెళ్లారు. అద్దె విషయంలో దీప్సిఖకు, అద్దెకు ఉంటున్న దంపతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ దంపతులు ఆగ్రహంతో ఆమె తలపై ప్రెషర్ కుక్కర్‌తో బలంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె మెడకు దుపట్టాతో ఉరి బిగించి ప్రాణాలు తీశారు. అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు, ఆమె మృతదేహాన్ని ఒక పెద్ద సూట్‌కేస్లో కుక్కారు. దీప్శిఖ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె పనిమనిషి మీనాకు అనుమానం వచ్చింది. మీనా వెంటనే బిల్డిం...

పెళ్లి వేడుకలో డబ్బులు వెదజల్లిన నిర్వాహకులు !

Image
ఉ త్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సిద్ధార్థనగర్‌లోని దేవల్వా గ్రామంలో ఓ పెళ్లి సందర్భంగా తీసిన వీడియో ఇది. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికి కారణం పెళ్లి ఊరేగింపులో ఆ కుటుంబీకులు చేసిన హడావుడి పెళ్లి బరాత్‌ సందర్భంగా వారు దాదాపు ఇరవై లక్షల రూపాయల నోట్ల కట్టలు గాలిలోకి వెదజల్లారు. పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులు కొందరు ఇంటి పైకప్పు, జేసీబీలపైకి ఎక్కి మరీ కరెన్సీ నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు. ఇదంతా కొందరు వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది. వీడియోలో చాలా మంది గాలిలోకి నోట్లు విసురుతున్నట్లు కనిపిస్తోంది. 100, 200, 500 రూపాయల నోట్లను గాలిలోకి విసిరినట్లు సమాచారం. ఇందుకోసం వారు జేసీబీని కూడా పిలిపించారు. కొందరు దానిపై నిలబడి, మరికొందరు బిల్డింగ్ పైకప్పుపై నిలబడి కరెన్సీ నోట్లను జల్లుతున్నారు. ఈ నోట్లను సేకరించేందుకు చాలా మంది తరలివచ్చారు. వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్‌ చేశారు. అతను అంత పెద్ద దాత అయితే, కొంతమంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండాల...